Header Banner

స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున రెండోసారి.. అది గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా గూస్‌బంప్స్! మాజీ క్రికెట‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

  Wed Apr 02, 2025 15:57        Sports

స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా రెండోసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచింది. 2011 ఏప్రిల్ 2న ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్లో శ్రీలంక‌ను ఓడించి భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను ముద్దాడింది. కెప్టెన్ ధోనీ సిక్స‌ర్‌తో మ్యాచ్‌ను ముగించ‌డం ఎప్ప‌టికీ అభిమానులు మ‌రిచిపోలేరు. ఇలా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌-2011ను టీమిండియా గెలుపొంద‌డంపై మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. 14 ఏళ్లు గ‌డిచినా ఆ విజ‌యాన్ని గుర్తుచేసుకుంటే ఇప్ప‌టికీ త‌న‌కు గూస్‌బంప్స్ వ‌స్తాయంటూ యువీ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. 

 

ఇది కూడా చదవండి: సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

"2011 ఏప్రిల్ 2. ఆ రాత్రి వంద కోట్ల మంది కోసం పోరాడాం. ఆ ప్రపంచ కప్ కేవలం విజయం కాదు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా భార‌త క్రికెట్‌ను త‌న భుజాల‌పై మోసిన లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఈ విజ‌యం అంకితం చేశాం. అత‌డిని చూస్తూ మేము పెరిగాం. ఆ రాత్రి అతనికి జీవితాంతం గుర్తిండిపోయే క్షణాల‌ను ఇవ్వడానికి మేము ఆడాం. 14 ఏళ్లు అయినా ఆ విజ‌యాన్ని గుర్తుచేసుకుంటే ఇప్ప‌టికీ నాకు గూస్‌బంప్స్ వ‌స్తాయి. ఆ రాత్రిని ఎప్పటికీ మ‌ర్చిపోలేం" అని యువ‌రాజ్ సింగ్ త‌న 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు. ఇక ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన యువీ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అలాగే క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూనే అత‌డు 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌టం గ‌మ‌నార్హం. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia